Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైలులో టెంకాయ ఎందుకు తీసుకెళ్లకూడదు? అసలు కారణం ఇదే!

Why you should not carry a coconut in a train here is the real reason
Advertisement
  • రైలులో టెంకాయపై భద్రతా ఆంక్షలు
  • ఎండిన టెంకాయ పీచుకు త్వరగా మండే గుణం
  • బోగీలో మంట వేగంగా వ్యాపించే ప్రమాదం
  • మండే వస్తువుల రవాణాపై రైల్వేల్లో ఆంక్షలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
Advertisement
మన ఇళ్లలో టెంకాయ చాలా సాధారణం. పూజలు, వంటలు, పండుగలు.. ఇలా ఎన్నో సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తాం. కానీ రైలు ప్రయాణంలో మాత్రం టెంకాయ విషయంలో నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా పీచుతో సహా పూర్తిగా ఎండిన కొబ్బరికాయను రైలులో తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి. ఇంతకీ దాన్ని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారంటే..

ఎండిన టెంకాయపై ఉండే పీచు చాలా త్వరగా మంట అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. నిప్పురవ్వ లేదా ఇతర మండే పదార్థాలకు తగిలితే మంట వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. రైలు బోగీల్లో ప్రయాణికులు, సామాన్లు దగ్గరగా ఉండటంతో చిన్న మంట కూడా పెద్ద ప్రమాదంగా మారొచ్చు. అందుకే పీచుతో ఉన్న ఎండు టెంకాయను రైల్వే భద్రతా నిబంధనల్లో ప్రమాదకర వస్తువుగా పరిగణిస్తారు.

మండే వస్తువులపై ఆంక్షలు
రైల్వేల్లో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే పలు వస్తువులపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. గ్యాస్‌ సిలిండర్లు, కిరోసిన్‌, బాణసంచా, పేలుడు పదార్థాలు, మండే రసాయనాలు వంటి వాటిని అనుమతి లేకుండా తీసుకెళ్లకూడదు. వీటితో పాటు ఎండిన టెంకాయ విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అనుమతి లేకుండా ప్రమాదకర లేదా మండే వస్తువులను రైలులో తీసుకెళ్తే జరిమానా విధించే అవకాశం ఉంది. ఉల్లంఘన తీవ్రతను బట్టి జైలుశిక్ష కూడా పడొచ్చు. ఆ వస్తువు వల్ల రైల్వే ఆస్తికి నష్టం జరిగినా, ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడినా అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement
Indian Railways
Coconut travel restrictions
Railway safety rules
Flammable items train
Indian Railways penalties
Train travel safety

More Telugu News